చైతన్యపరిచే ప్రభంజనం

ఇది ఎన్నికల వేళ.
ఓటర్లను చైతన్యపరిచే ప్రభంజనం చిత్రం విడుదలైంది. ఓటర్లను చైతన్యపరుస్తూ సమసమాజ స్థాపన కోసం నలుగురు యువకులు ఎలాంటి పోరాటం చేశారన్న ఇతివృత్తం ఆధారంగా ప్రభంజనం చిత్రం నిర్మితమైంది.
చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ప్రధాన పాత్రలలో నటించిన చిత్రమే ప్రభంజనం.
ఇరవై ఏళ్ళ తన ఆలోచనలకు ప్రతిబింబమే ఈ చిత్రమని దర్శక నిర్మాత భాస్కర రావు వేండ్రాతి చెప్పారు. ఆరున్నర దశాబ్దాలుగా మన ఆర్ధిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి … ఆ మార్పులకు కారణం ఏమిటి …ఓటర్లు నోటుకు, తాగుడుకు లొంగి వోటు వేయడానికి కారణం ఏమిటి  తదితర అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది అని ఆయన చెప్పారు.
ఓటు వేసే ప్రతి వ్యక్తి ఈ చిత్రం చూడాలి. అయితే ఎవరినీ కించపరిచే విధంగా ఈ సినిమా ఉండదని దర్శక నిర్మాత తెలిపారు.

Send a Comment

Your email address will not be published.