జక్కన్న పరవాలేదు

Jakkannaహీరోగా మారిన కామెడీ నటుడు సునీల్ ఎంచుకుని చేసిన జక్కన్న పిక్చర్ పరవాలేదు. కామెడీ నటుడిగా దూసుకుపోతున్న సమయంలో హీరోగా శ్రీకారం చుట్టి విజయవంతమైన సునీల్ ఆ తర్వాత వరుసగా ప్లాప్ అయ్యాడు.

అయితే ఇప్పుడు ఆలస్యమైనా కాస్త చెప్పుకోదగ్గ చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జక్కన్నగా.

సునీల్ తో పాటు మన్నార్ చోప్రా, సప్తగిరి , పృద్వి తదితరులు నటించిన చిత్రమే జక్కన్న.

ఆర్పీఏ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించారు. దినేష్ స్వరాలూ అందించారు.

సునీల్ సరసన మన్నార్ చోప్రా నటించింది.

గణేష్ పాత్రలో నటించిన సునీల్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తనకు ఎవరైనా సహాయం చేస్తే వారికి తిరిగి సహాయం చేయడానికి ఏ మాత్రం ఆలోచించాడు. తనవరకైనా సహాయం చేస్తాడు. అతనికి వైజాగ్ నగరానికి చెందిన డాన్ భైరాగి గణేష్ చిన్నతనంలో సహాయం చేస్తాడు. దీనితో డాన్ ని కలవడానికి గణేష్ వైజాగ్ వెళ్తాడు. అతనిప్పుడు ఓ రౌడీ అని తెలుసుకుని అతనిని సన్మార్గంలో పెట్టడానికి గణేష్ ప్రయత్నిస్తాడు. ఇంతలో భైరాగి చెల్లెలు సహస్ర పాత్రలో నటించిన మన్నారా చోప్రా గణేష్ ప్రేమలో పడుతుంది. ఇదీ కథ. అయితే గణేష్ రౌడీని మార్చేదా? సహస్ర ప్రేమ ఫలించిందా లేదా వంటి ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలనుకుంటే జక్కన్న చిత్రం చూడాలి.

సునీల్ నటన బాగుంది. అతను చేసిన డాన్సులు చిరును గుర్తు చేస్తాయి. అలాగే సప్తగిరి – పృథ్వీ మధ్య కామెడీ ట్రాక్ కూడా నవ్వు తెప్పించింది.
క్లైమాక్స్ తృప్తికరం.

కథలో మలుపులు గొప్పగా లేవు. సంగీతం కూడా యావరేజ్ గా ఉంది.

కథానాయిక మన్నార్ చోప్రా తన అందంతో ఆకట్టుకుంది.ఆమెకిదే మొదటి చిత్రం. సప్తగిరి, పృద్వీ బాగానే హాస్యాన్ని పండించారు. సినిమా విజయానికి వీరి హాస్యం తోడ్పడింది.

దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ , ఈ చిత్రంలో క్లిక్కయ్యాడు.

ఏదేమైనా సునీల్ సక్సస్ అయినట్టు చెప్పుకోవచ్చు.

Send a Comment

Your email address will not be published.