జగమే మాయ పాటకు అక్కినేని

దేవదాసు దాదాపు అన్ని భారతీయ భాషలలోను రూపొందించారు బెంగాలీ రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ  నవల ఆధారంగా తొలి సారి మూఖీ చిత్రం 1928 లో తీశారు. ఆ తర్వాత బెంగాలీలో 1935 లో దేవదాస్ పేరిట సినిమా తీశారు. 1936 లో హిందీలో, 1937 లో అస్సామీలో, 1953 లో తెలుగులో, అదే ఏడాది ఈ తెలుగు చిత్రమే తమిళంలో డబ్ చేయగా, 1955 లో మళ్ళీ హిందీలోను, 1965 లో ఉర్దూలోను, 1974 లో తెలుగులో రీమేక్ చేయగా 1982 లో బంగ్లాదేశీ భాషలోను, 1989 లో మళ యాలంలోను ఈ దేవదాసు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్ వీ రంగా రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి తెలుగులో సాహిత్యం సమకూర్చిన వారు సీనియర్ సముద్రాల రాఘవా చార్య. ఘంటసాల వెంకటేశ్వర రావు, సి ఆర్ సుబ్బురామన్ సంగీతం సమర్పించారు.
వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిడివి 191 నిముషాలు. బీ ఎస్ రంగా సినిమాటోగ్రఫీ. ఫిలిం ఫేర్ అవార్డు కూడా పొందిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టైంది. మొదట్లో ఈ చిత్రానికి అక్కినేనిని ఎంపిక చేసినప్పుడు ఆయనను తీసుకోవద్దని చాలా మంది నిర్మాత డీ ఎల్ నారాయణకు, దర్శకుడు వేదాంతం రాఘవయ్యలకు చెప్పారు. అయినా దర్శక నిర్మాతలు వారందరి సూచనను తిరస్క రించి అక్కినేనితోనే చిత్రం తీసారు. ఈ చిత్రంలోని జగమే మాయ పాట చిత్రీకరణ ఎప్పటికీ మరచిపోలేము. కానీ ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది. ఈ పాటలో  అక్కినేని నిజంగానే తాగి నటించేరా అని అప్పట్లో ఒక చర్చ కొనసాగింది. అవునని చాలా మంది, కాదని ఒకరిద్దరు వాదించారు. కానీ ఈ పాటకు చిత్రీకరణ రాత్రి వేళల్లో తీశారు. అక్కినేని నాగేశ్వర రావు సుష్టుగా భోజనం చేసి షూటింగులో పాల్గొనే వారట. దానితో నిద్ర వచ్చి కళ్ళు మూతలు పడేవని, ఆలాంటి సమయంలో చిత్రీకరించిన పాటకావడంతో అక్కినేని తాగి నటించారనే భ్రమ కలిగింది. కానీ ఆయన తాగి నటించలేదు అనేదే నిజం.

Send a Comment

Your email address will not be published.