“నాన్నకు ప్రేమతో…” చిత్రంతో యాభై కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన జూనియర్ ఎన్ టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రం “జనతా గ్యారేజ్పై” బోలెడంత ఆశలు పెట్టుకున్నారు.
జనతా గ్యారేజ్ చిత్రం ఆగస్టు 2 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి దర్శకులు కోరుట్ల శివ.
ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తప్పకుండా క్లిక్ అవుతుందని జూనియర్ ఎన్ టీఆర్ అంచనా.
జనతా గ్యారేజ్ చిత్ర పబ్లిసిటీ పై ఎన్ టీ ఆర్ ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. ఈ చిత్రం ప్రమోట్ చేయడం కోసం ఆయన తన ఆఫీసులోనూ, షూటింగ్ సమయాలలోను తన అభిమానులను తెగ కలుస్తున్నారు. మాట్లాడుతున్నారు. అంతేకాదు వాళ్ళతో ఫోటోలు కూడా తీసుకోవడానికి టైం కేటాయిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఉన్న తన ఆఫీసుకి తన అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ జూనియర్ ఎన్ టీఆర్ ని కలిసి వెళ్తున్నారు. ఇదంతా జనతా గ్యారేజ్ ఫిల్మ్ ప్రమోషన్ లో భాగమే అని అభిజ్ఞ వర్గాల భోగట్టా.
ఈమధ్య నిజామాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి అయిదు వందల మంది అభిమానులు వచ్చి ఎన్ టీ ఆర్ తో మాట్లాడి వెళ్లారు.