జస్ట్ 35 ఏళ్ళే

బొమ్మరిల్లు ఫేం సిద్ధార్ద్ పై మీడియా ఈమధ్య  ఏవేవో వార్తలు రాశాయి. వాటికి సిద్ధార్ద్  ప్రతిస్పందించారు. సిద్ధార్ద్ కు పదిహేనేళ్ళ కొడుకు ఉన్నాడన్నది ఒక వార్త. దీనికి సిద్ధార్ద్ సమాధానం ఇచ్చారు. తనకింకా 35 ఏళ్ళే అని జవాబిచ్చారు. అటువంటప్పుడు తనకు పదిహేనేళ్ళ కొడుకు ఉండటం ఎలా సాధ్యమని సిద్ధార్ద్  ఎదురు ప్రశ్న వేశారు.

“కొన్ని రోజులుగా తన మీదా, తమ ఫ్యామిలీ మీదా  ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నన్ను కలవరపరచిన మాట వాస్తవం. వాటికి అలవాటు పడిపోయాను. అయినా నాకంటూ ఎంతో కొంత గౌరవం ఉందనే అనుకుంటున్నాను.  కొన్ని సంవత్సరాల క్రితం కూడా దాదాపు ఇలాంటి వార్తలే నా మీద వచ్చాయి. ఆ వార్తలన్నీ ఎవరైనా చదివితే  నాకు నిజంగానే ఒక  పిల్లాడు ఉన్నాడని నమ్మించే విధంగా  ఉన్నాయి. కానీ ఇలాంటి అనవసరపు రాతలు సరి కావు. నాకు 35 ఏళ్ళు. మునుపటి కన్నా నేను మరింత కష్టించి నా కెరీర్ కొనసాగిస్తున్నాను. జీవితంలో స్థిరపడినప్పుడు అన్ని విషయాలూ నేనే స్వయంగా వెల్లడిస్తాను. అప్పటి వరకు కాస్త ఆగండి. తొందరెందుకు. నేనే చెప్తానుగా ..ప్లీజ్ అప్పటిదాకా వేచి ఉండండి” అని సిద్ధార్ద్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.