జీరో సైలెంట్

ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వంలో పరమ్ వి పొట్లూరి నిర్మాతగా విడుదల అయిన ‘సైజ్ జీరో’ చిత్రం బాగానే ఉంది. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి.

అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్త, ఊర్వశి, ప్రకాష్ రాజ్, గొల్లపూడి మారుతి రావు, అడవి శేష్,మాస్టర్ భరత్ తదితరులు నటించిన ‘సైజ్ జీరో’ అనుష్క ను చూస్తున్నంతసేపు మనల్ని కిలకిలా నవ్వించింది అనడంలో సందేహం లేదు.
.
కె రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన ‘సైజ్ జీరో’ ద్విభాషా చిత్రం. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ఆహా ఓహో అనిపించుకుంటోంది.

కథలోకి వెళ్తే, బాల్యం నుంచీ ముద్దుగా చూడ బొద్దుగా ఉండే అనుష్క చుట్టూ ఈ కథనం సాగుతుంది. ఆమె బొద్దుగా ఉండడంతో పెళ్లి సంబందాలు వచ్చినా ఆమె ఆకారాన్ని చూసి వద్దని వెళ్లిపోతుంటారు. అయినా అనుష్క మాత్రం తనకు ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఓ రాజకుమారుడు ఉంటాడని, తనను వెతుక్కుంటూ వస్తాడని చెప్తూ ఉంటుంది. ఆమె అనుకున్నట్టే అభి పాత్రలో నటించిన ఆర్య వస్తాడు. అయితే ఈసారి అబ్బాయిని తిరస్కరించే వంతు అనుష్కదవుతుంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య అప్పటికే పరిచయం ఉండటం వల్ల అనుష్క, ఆర్య మిత్రులవుతారు. ఆ స్నేహపర్వంలోనే అనుష్క ఆర్యను ప్రేమించడం ఆరంభిస్తుంది.

మరోవైపు, ఆర్య చేస్తున్న ఓ డాక్యుమెంటరీ తనకు నచ్చి సోనాల్ చౌహాన్ అతనితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ విషయం తెలిసి అనుష్క వారికి దూరంగా వెళ్తుంది.

ఇదిలా ఉండగా తక్కువ టైంలోనే సన్నబడాలని అనుకునే ప్రకాష్ రాజ్ ” సైజ్ జీరో ” ట్రైనింగ్ క్లాస్ లో అనుష్క చేరుతుంది. అయితే ప్రకాష్ రాజ్ చేస్తున్న మోసాలు తెలుస్తుంటాయి. దానితో అతనిపై పోరుకు తెర తీస్తుంది అనుష్క. ఆమెకు ఆర్య, సోనాల్ మద్దతు లభిస్తుంది. వీళ్ళ ముగ్గురు ప్రకాష్ రాజ్ మోసాలను ఎలా ఎండగట్టారు అనేది తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘సైజ్ జీరో’ చూడక తప్పదు.

అనుష్క స్వీటీ పాత్రలో యమ జోరుగా నటించింది. ఇన్ దులో అనుష్క పాత్ర భిన్నమైనది. ఆర్య నటన కూడా బావుంది. సోనాల్ చౌహాన్ తన పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసింది.

కథనంలో ఎలాంటి ట్విస్ట్ లు పెద్దగా లేకపోయినా సినిమా చూస్తున్నంత సేపు విసుగు పుట్టదు. .

కిరణ్ మాటలు బాగానే ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.