జులైలో ప్రభాస్ పెళ్లి

ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి కాబోతున్నట్టు తెలియవచ్చింది. ఆమె పేరు నేహా. దక్షిణాఫ్రికాలో ఓ ఇన్వెస్ట్ మెంట్ సంస్థగా బిజినెస్ చేస్తున్న ఓ ఎన్ ఆర్ ఐ కుమార్తె నేహా. వీరిద్దరికీ చాలా కాలంగానే పరిచయముంది. నేహా తన గర్ల్ ఫ్రెండ్ అని, పెళ్లి చేసుకుందామన్న మనసులోని మాటను చెప్పడానికి తగిన సమయం కోసం చూశానని చెప్పిన ప్రభాస్ చివరికి ఆ ప్రపోసల్ ని ఇటీవల ఒక విందులో నేహాతో చెప్పినట్టు తెలిసింది. తొలిసారిగా ప్రభాస్, నేహా బాహుబలి సెట్స్ లో కలుకున్నారని, అప్పటి నుంచి తరచూ వీరిద్దరూ కలుస్తున్నట్టు తెలిసింది. నేహా దక్షిణాఫ్రికా నుంచి అప్పుడప్పుడూ హైదరాబాద్ కి వచ్చి ప్రభాస్ ని చూసి వెళ్తున్నట్టు కూడా తెలిసింది.

బాహుబలి విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్న విందులో ప్రభాస్, నేహా కుటుంబ సభ్యులు కలుసుకున్నప్పుడే ప్రభాస్ నేహాతో తన ఇష్టాన్ని చెప్పినట్టు తెలిసింది. అందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్టు తెలిసింది. మరో రెండు వారాల్లో వీరి నిశ్చితార్ధం జరుగుతుందని, జూలై 31న పెళ్లి జరగవచ్చని కూడా తెలిసింది. ప్రభాస్ కు నేహా నచ్చిన విషయం తెలిసి కృష్ణంరాజు, కుటుంబ సభ్యులూ సంతోషంగా ఉన్నారని సన్నిహిత వర్గాల భోగట్టా….

Send a Comment

Your email address will not be published.