జూ. ఎన్ టీ ఆర్ రభస

జూనియర్ ఎన్ టీ ఆర్ హీరోగా నటిస్తున్న రభస చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్ టీ ఆర్ కు జతగా సమంతా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ జోడీగా బృందావనం చిత్రంలో నటించారు. ఆ సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న రభస చిత్రం కూడా తనకు స్టూడెంట్ నెం. 1, ఆది, సింహాద్రి, యమ దొంగ. అదుర్స్, బృందావనం తదితర చిత్రాలలా మంచి విజయాన్ని సాదించిపెడుతుందన్న ఆశాభావాన్ని ఎన్ టీ ఆర్ వ్యక్తం చేసారు.

బాద్ షా చిత్రం కలెక్షన్ పరంగా బాగానే వసూలు తెచ్చిపెట్టినా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిపోయిందికానీ ఇప్పుడు రభస చిత్రం అన్ని విధాలుగానూ ఎన్ టీ ఆర్ కు విజయం సాదించి పెడుతుందని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అంటున్నారు.

బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్ టీ ఆర్ ఎన్నో జాగర్తలు తీసుకున్నారని, ప్రతీ సన్నివేశం చక్కగా వచ్చిందని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.

Send a Comment

Your email address will not be published.