జూన్ నెలలో "గుండె జారి ...."

గుండె జారి గల్లంతయ్యింది చిత్రానికి సీక్వెల్ గా వచ్చే మరో భాగంలో నటించడానికి నితిన్ సిద్ధంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాల భోగట్టా.

గుండె జారి గల్లంతయ్యింది చిత్రానికి దర్శకుడు విజయ్ కుమార్ కొండా.
ఆయనే మరో రొమాంటిక్ స్టోరీతో నిఖిల్ వద్దకు వచ్చి కథ మొత్తాన్ని చెప్పారు.
కథ నచ్చిన నితిన్ అందులో నటించడానికి సమ్మతించినట్టు తెలిసింది.
ఈ చిత్రం షూటింగ్ సూన్ నెలలో మొదలవుతుంది.

ప్రస్తుతం ” అ, ఆ ” చిత్రంతో నితిన్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఆ చిత్రం పూర్తి కావడంతోనే కొంచం విశ్రాంతి తీసుకున్న తర్వాత నితిన్ గుండె జారి గల్లంతయ్యింది చిత్రానికి సీక్వెల్ గా తీసే చిత్రంలో నటిస్తారు.

ఆ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తమ సొంత బ్యానర్ కింద నిర్మాస్తారని తెలిసింది.

ఈ చిత్రానికి కథానాయికగా శృతి హాసన్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ఆమెను కలిసి మాట్లాడే అవకాశాలున్నాయని తెలిసింది.

ఈ చిత్రంలో కథానాయికకు బాగా స్కోప్ ఉందని, కనుక ఆమె నటించడానికి ఒప్పుకుంటారని చిత్ర యూనిట్ ఆశ.

Send a Comment

Your email address will not be published.