జై లవ కుశ ఒరిజినలే!

త్వరలో రాబోతున్న జై లవ కుశ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. తమిళంలో అజిత్ నటించిన వరలారు చిత్రానికి స్పూర్తిగా ఈ తెలుగు చిత్రం తయారవుతున్నట్టు వచ్చిన వార్తల నేపద్యంలో చిత్ర యూనిట్ ఓ వివరణ ఇచ్చింది. అజిత్ నటించిన వరలారు చిత్రానికి, ఈ జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి అసలు సంబంధం లేదని ఆ వర్గాలు తెలిపాయి. రెండూ వేర్వేరు కథలని, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం పూర్తిగా ఒరిజనలే అని పేర్కొన్నాయి.

తమిళ చిత్ర నిర్మాత తెలుగు చిత్ర నిర్మాతను కలిసి తానూ ఫిర్యాదు చేయబోతున్నట్టు చెప్పినప్పుడు చిత్ర రచయిత కథను టూకీగా చెప్పారు. అదంతా విన్న తమిళ నిర్మాత అది పూర్తిగా భిన్నమైనదని గ్రహించి ఫిర్యాదు ఆలోచనను విరమించుకున్నారు.

తమిళ చిత్రంలో అజిత్ తండ్రి పాత్రను, ఇద్దరు కొడుకుల పాత్రనూ పోషించగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మూడు యువ క్యారెక్టర్ లను పోషిస్తున్నారు. గుడ్, బ్యాడ్, అగ్లీ అని తెలుగు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. కె ఎస్ రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

స్త్రీ పాత్రల్లో నివేదితా తామస్, రాశి ఖన్నా ప్రధానంగా నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.