జోడీగా శ్రుతిహాసన్

ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా షూటింగు నవంబర్ 8వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ చిత్రం సన్నివేశాలు కొన్ని పూనే లోను, మరి కొన్ని విదేశాలలోనూ  చిత్రీకరిస్తారు.

షూటింగుల  నుంచి కొన్ని రోజులపాటు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి దీర్ఘ సెలవులు సరదాగా గడుపుతున్న మహేష్ బాబు కొత్త సినిమా నవంబర్ లో మొదలు కానుంది. ఈ కొత్త సినిమాకి కోరట్ల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడి పట్ల సంతోషం వ్యక్తం చేసిన మహేష్ బాబు స్క్రిప్ట్ కూడా బాగుందని చెప్పినట్టు సన్నిహిత వర్గాల భోగట్టా.

ఈ కొత్త సినిమా మొదటి షెడ్యూల్ పూనేలో మొదలవుతుంది. మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా నటించాలని ఉందని మహేష్ బాబు చెప్పినట్టు తెలిసింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు విదేశాలలో చిత్రీకరిస్తారు. ఇదొక కుటుంబ కథా చిత్రం. ఈ నవీన్, వై రవికుమార్, సి వీ మోహన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

Send a Comment

Your email address will not be published.