జోరుగా 'మహానటి' చిత్రీకరణ

Mahanatiఅలనాటి అందాల తార సావిత్రి జీవితచరిత్రపై తీస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంతో సాగుతోంది. ఈ చిత్రం పేరు మహానటి. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. చలనచిత్ర పరిశ్రమలో సావిత్రి ఎదిగిన తీరు, అలాగే ఆమె జీవితంలో జరిగిన కొన్ని ప్రధానమైన ఘట్టాలూ ఈ చిత్ర కథనంలో చూడొచ్చు. అంతేకాకుండా సావితి పతనావస్థకూడా ఈ చిత్రంలో చూపడానికి దర్శకుడు ఆలోచిస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా.

సావిత్రి మద్యానికి ఎలా బానిసైంది, ఆమె జీవితాన్ని మద్యం ఎలా నాశనం చేసింది, తన జీవితం చివరి రోజుల్లో సావిత్రి సర్వం కోల్పోవడం వంటి సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో చూపించే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి సావిత్రి నటించిన మాయాబజార్ అధ్యాయంపై ఇప్పటికే చిత్రీకరణ ముగిసింది. ఇప్పుడు మిగిలిన వాటిపై చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో జెమినీగణేశన్ పాత్రలో దల్ క్వీర్ సల్మాన్ నటిస్తున్నారు.

నిజ జీవితంలో జెమినీగణేశన్ సావిత్రి భర్త అనే విషయం తెలిసిందే కదా.

కీర్తి సురేష్ అనే తార సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. సావిత్రి అంకుల్ గా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు. దివ్యవాణి, భానుప్రియ తదితరులు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దివ్యవాణి సావిత్రి తల్లి పాత్రలో కనిపిస్తారు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సావిత్రి చెన్నై చేరినప్పుడు బంధువు అయిన కెవి చౌదరి ఆమెకు ఎంతగానో సాయపడ్డారు. ఆ చౌదరి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు.

Send a Comment

Your email address will not be published.