"జోరు"లో బ్రహ్మి హైలైట్

తన సారధ్యంలో రూపుదిద్దుకున్న జోరు చిత్రం తప్పకుండా సూపర్ హిట్ కొడుతుందని దర్శకుడు కుమార్ నాగేంద్ర గట్టి నమ్మకం.

దర్శకుడు కుమార్ నాగేంద్ర కు   జోరు సినిమా రెండోది. ఆయన మొదటి చిత్రం గుండెల్లో గోదారి. మొదటి సినిమా లా కాకుండా ఈ రెండో చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. యువ నటుడు సందీప్ కిషన్ జోరు చిత్రం కథానాయకుడు. రాశి ఖన్నా, సుష్మా రాజ్, ప్రియ బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో అందరి పాత్రలు కీలకమైనవే అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి “ఎ” సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ హైలైట్ అవుతుందని దర్శకుడు కుమార్ నాగేంద్ర చెప్పారు. సందీప్ కిషన్ బ్రహ్మానందంతో కలిసి చేయడం ఇదే మొదటిసారి. బ్రహ్మానందం నటించిన సన్నివేశాలన్నీ ప్రేక్షకులను తప్పకుండా నవ్విస్తాయని ఆయన ధీమా.

Send a Comment

Your email address will not be published.