జ్యోతిక మళ్ళీ నటిస్తుందా?

నటి జ్యోతిక మళ్ళీ వెండితెరపై కనిపించాబోతోందా అని ప్రశ్నించుకుంటే అవుననే జవాబులు వస్తున్నాయి. ఆమె తన భర్త హీరో సూర్యతో కలిసి తాజాగా ఓ చిత్రంలో నటించబోతోందని సినీ వర్గాల భోగట్టా. కొన్ని నెలల క్రితం సూర్య మాట్లాడుతూ తానేమీ తన భార్య జ్యోతికను నటించడం మాని ఇంటి వద్దే ఉండమని చెప్పలేదన్నాడు. ఆమె పెళ్ళైన తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చి ఇంటి దగ్గరే ఉందామని, పిల్లలను చూసుకోవాలని  అనుకుందని, ఇందులో తన ప్రమేయమేమీ లేదని అన్నాడు. అయితే ఆమె నటించాలనుకుంటే త్వరలోనే మళ్ళీ నటించే అవకాశాలు ఉన్నాయని, అదంతా ఆమె ఇష్టమని అప్పుడే చెప్పాడు సూర్య. ఈ క్రమంలో ఇప్పుడు జ్యోతిక, సూర్య కలిసి తామే సొంతంగా ఒక ప్రొడక్షన్ ప్రారంభించి, దానికి 2 డీ అని పేరు పెట్టాలనుకున్నారు. ఈ ప్రొడక్షన్ ద్వారా వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని అనుకుంటున్నారు. ప్రొడక్షన్ పేరు 2 డీ అనడంలో ఓ అర్ధం లేక పోలేదు. సూర్య దంపతుల పిల్లల పేర్లు దియా, దేవ్. ఈ రెండు పేర్లలో మొదటి అక్షరాలూ డీ తో ప్రారంభం కావడంతో తమ ప్రొడక్షన్ కు 2 డీ అని పేరు పెట్టాలనుకున్నారు. ఈ బ్యానర్ కింద సూర్య దంపతులు నటించబోయే చిత్రాన్ని ఆరు, సింగం చిత్రాలకు దర్శకత్వం చేసిన హరి ఈ తాజా సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. సూర్యతో కలిసి జ్యోతిక ఒక ప్రధాన పాత్రలో నటిస్తుందని సన్నిహిత వర్గాల మాట. అయితే ఆమె కేవలం సూర్య నటించే చిత్రాల్లో మాత్రమె నటిస్తుందా లేక ఫుల్ టైం హీరోయిన్ గా ఇతర చిత్రాల్లోనూ నటిస్తుందా అనేది ఇంకా తెలియలేదు.

Send a Comment

Your email address will not be published.