జ్యోతిలక్ష్మి షూటింగ్ ప్రారంభం

తన కెరీర్ లో కొత్త మలుపు కోసం చూస్తున్న చార్మీ నట జీవితం పూర్వంలా అంత వేగంగా సాగకపోయినా ఎలాగోలా నడుస్తోంది. కానీ చార్మీ గొప్ప మలుపుకోసం చూస్తోంది.

ఓ వైపు నటిస్తూనే మరో వైపు ఐటెం సాంగ్స్ కూడా చేస్తున్న చార్మీ జ్యోతి లక్ష్మి చిత్రం చేయడానికి అంగీకరించిన విషయం విదితమే. ఆ చిత్రంలో నటించడమే కాదు సమర్పించడానికి కూడా ముందుకొచ్చింది.

చార్మీ టైటిల్ పాత్రలో కనిపిస్తున్న జ్యోతిలక్ష్మి సినిమా చిత్రీకరణ మార్చి ఎనిమిదో తేదీన ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ చిత్రం తాలూకు ఒక పోస్టర్ ని , అలాగే తీజర్ ని ఆ రోజు విడుదల చేసారు. సి కె ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ మీద రూపుదిద్దు కుంటున్న ఈ చిత్రం ఒక ప్రముఖ నవల ఆధారంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం చార్మీ కొంత బరువు కూడా తగ్గించుకోవడం విశేషం. ఆమె ఎంతో నాజూకుగా కనిపిస్తోందని చిత్ర యూనిట్ మాట. అనుకున్న టైం కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే వేసవి చివరిలో విడుదల చేయాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.

ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.