టాలీవుడ్ భారీ చిత్రాలు

టాలీవుడ్  కి వచ్చే ఏప్రిల్ అత్యంత  కీలకం. ఎందుకంటే  ఈ  ఏప్రిల్ నెలలోనే  భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.  పవన్ కళ్యాన్  నటించిన  సర్దార్  గబ్బర్  సింగ్,  అల్లు అర్జున్  నటించిన  సరైనోడు, మహేష్ బాబు నటించిన  బ్రహ్మోత్సవం చిత్రాలు ఏప్రిల్ లో విడుదలకానున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్  చిత్రం  “అ  ….ఆ  …” కూడా  ఈ సందడిలోనే  వెండితెరకు రానుంది.  కనుక  ఈ వేసవిలో ఎవరు బాద్షానో తేలిపోతుంది.  పవన్ కళ్యాన్,  మహేష్  బాబు  తమ తమ  చిత్రాలకు  సంబంధించి    దగ్గరుండి  ఎన్నో  జాగర్తలు తీసుకుంటున్నారు.  వీరిద్దరి  సినిమాలు విడుదల  కాకముందే వంద  కోట్ల బిజినెస్   చేసేసాయి.

నిరుడు మహేష్ బాబు తన శ్రీమంతుడు చిత్రంతో చరిత్ర సృష్టించారు. బాహుబలి తర్వాత  శ్రీమంతుడు చిత్రం రెండో స్థానంలో  నిలిచింది.  పవన్ కళ్యాన్  అత్తారింటికి  దారేది  చిత్రానికి  ఆ తర్వాతి స్థానం  దక్కింది.  అయితే  ఈసారి సర్దార్  గబ్బర్ సింగ్ తో పవన్  కళ్యాన్ ఆ  లోటు  అధిగమించడానికి  కృషి చేస్తున్నారు.  ఈ చిత్రానికి   సంబంధించి ఇప్పటికే  పబ్లిసిటీ  మొదలుపెట్టేసారు కూడా.    మరోవైపు అల్లు  అర్జున్  సరైనోడు చిత్రం  కూడా  విడుదలకు ముందే  భారీ  బిజినెస్  చేయవచ్చని ఆశిస్తున్నారు.

ఇది  ఇలా ఉండగా  , తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేసిన  కొన్ని చిత్రాలు కూడా    అటూ ఇటుగా విడుదల కానున్నాయి. ఈ  సమయంలోనే  ఐ పీ ఎల్  పొట్టి క్రికెట్  సీజన్ కూడా  ఈ  ఏప్రిల్ లోనే  జరగబోవడంతో  భారీ  బడ్జెట్  చిత్రాలు ఏ మేరకు క్లిక్ అవుతాయా అన్నది ఒక  ప్రశ్నించుకోవలసిన అంశం.

Send a Comment

Your email address will not be published.