టాలీవుడ్ లో శ్రద్ధ

shraddha dasకన్నడ నటి శ్రద్ధ తెలుగు చలన చిత్ర రంగంలో నటించబోతోంది. ఆమె నటిస్తున్న చిత్రంలో జొన్నలగడ్డ సిద్ధూ హీరోగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పేరేపు రవికాంత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపు దిద్దుకోబోతోంది. ఇప్పటికే కన్నడం, తమిళం చిత్రాలలో బిజీ నటిగా పేరు పొందిన శ్రద్ధ ఇప్పుడు తెలుగులోనూ నటిస్తోంది. గత ఏడాది కన్నడంలో ఘన విజయం సాధించిన యు టర్న్ చిత్రంతో ఆమెకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఆమె వృత్తిపరంగా లాయరు. క్షణం చిత్రంతో వెలుగులోకి వచ్చిన రవికాంత్ ఆమె నటనను గుర్తించి తను దర్శకత్వం వహించే తెలుగు చిత్రానికి ఎంపిక చేసారు. ఇదొక వినోదాత్మక చిత్రం. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ఆయన తన స్క్రిప్ట్ లో కొత్తదనం కోసం ప్రయత్నించారు. తన చిత్రానికి కొన్ని నెలలపాటు జరిపిన ఆడిషన్ తర్వాత శ్రద్ధ ను కథానాయికగా ఎంపిక చేసారు. మరెవరూ ఈ పాత్రకు సరిపోరనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్టు రవికాంత్ తెలిపారు. తాను అనుకున్న పాత్రకు ఆమె అన్ని విధాలా సరిపోయిందని కూడా ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.