టాలీవుడ్ లో " స్వర్ణ పాదం"

ఇటీవల విడుదల అయిన లౌక్యం సినిమా లో నటించిన  హంస నందిని ని స్వర్ణ పాదంగా సినీ నిర్మాతలు, దర్శకులు అభివర్ణిస్తున్నారు. కారణం ఆమె టాలీవుడ్ లో ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు విజయవంతం కావడమే.

ఆమె టాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం అనుమానాస్పదం. ఇది కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన చిత్రం. ఆ తర్వాత ఈగ చిత్రంలో ఆమె నటించి తనకంటూ ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె ఓ విలక్షణ తారగా పేరు సంపాదించింది.

ఇప్పుడు లౌక్యం చిత్రంలో ఆమె నటించిన పాత్ర చిన్నదే అయినప్పటికీ ఓ ప్రత్యేక పాటలో ఆమె డ్యాన్స్ కు మంచి మార్కులే పడ్డాయి.

లౌక్యం చిత్రంలో ఆమె కామెడీ కింగ్ బ్రహ్మానందంకు భార్య పాత్రలో నటించింది. ఆయనకు భార్యగా నటించాలని దర్శకుడు శ్రీనివాస్ తనతో చెప్పినప్పుడు తాను మొదట్లో విస్తుపోయానని హంసనందిని తెలిపింది. బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ వెండితెరపైనే కాకుండా సెట్స్ లోను ఆయన అందరినీ నవ్విస్తూ ఉంటారని ఆమె చెప్పింది.

హీరో గోపీచంద్ ఓ నిలకడైన వ్యక్తిత్వం కల నటుడని, ఎంతో ” కూల్ పర్సన్ ” అని ఆమె అన్నది. .

తనకు ఇప్పటికే కొన్నిఆఫర్లు వచ్చాయని, కానీ వేటికీ ఇంకా పచ్చ జెండా ఊపలేదని అంటూ అవేవీ అంత థ్రిల్లింగా అనిపించలేదని చెప్పింది. సినిమాలో పాత్ర నిడివి కన్నా ఎలాంటి పాత్ర అనేది ముఖ్యమని ఆమె చెప్పింది. రోల్ ఎంతవరకు మంచిదో ముఖ్యమని ఆలోచించాలని ఆమె అభిప్రాయం.

ఈగ, మిర్చి, ఆత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం లలో తాను చేసిన స్పెషల్ సాంగ్స్ కి మంచి ఆదరణే లభించిందని ఆమె తెలిపింది. స్పెషల్ సాంగ్స్ లో తన దుస్తులను తానె డిజైన్ చేసుకుంటానని ఆమె చెప్పింది.

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రమదేవి చిత్రంలోనూ నటించిన హంసనందిని పూనే నివాసి. ఈ సినిమా కోసం ఆమె కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకుంది.

Send a Comment

Your email address will not be published.