టాలీవుడ్ వల్లే పేరుప్రఖ్యాతులు

నాలో ఒకడు సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన నటుడు సిద్దార్థ్ తనకు తెలుగు సినీ పరిశ్రమే పేరుప్రఖ్యాతులు తెచ్చి పెట్టాయని అన్నారు. ఎనక్కుల్ ఒరువన్ అనే తమిళ్ చిత్రం డబ్బింగే నాలో ఒకడు తెలుగు సినిమా.

నేనీరోజు పెద్ద స్టార్ గా ఈ రోజిలా ఉన్నానంటే దానికికారణం తెలుగు పరిశ్రమే అని సిద్దార్థ్ చెప్పుకున్నారు.

పేరుతో పాటు సంపద నాకొచ్చాయంటే అది టాలీవుడ్ పరిశ్రమ పుణ్యమే అని ఆయనన్నారు.

“నేను హిందీ చిత్రాలు చేస్తున్నప్పుడు కూడా తెలుగు పరిశ్రమ గురించి అందరితో చెప్పుకునే వాడిని. హైదరాబాదులో దాదాపు ఏడున్నర సంవత్సరాలు నివసించాను. నేను ఇప్పటి వరకు నటించిన 25 చిత్రాల్లో 12 తెలుగు చిత్రాలే. తెలుగు నటుడిగా నేను చాలా వర్క్ చేసాను. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి మేటి చిత్రాలు నా కెరీర్ లో మరీ మరీ మొదట్లోనే వచ్చాయి. అలాంటి సినిమాలు ఇప్పుడు వచ్చినట్టయితే బాగుండేది” అని సిద్దార్థ్ చెప్పారు. కొన్ని చిత్రాల కోసం తిరిగి చెన్నై వెళ్లానని, కానీ అవి అనుకున్నంతగా కలిసి రాలేదని ఆయన అన్నారు.

తాను మాస్ ఫిల్మ్స్ చేయలేనని, టాలీవుడ్ లో పది మంది అగ్ర స్థాయి దర్శకులు మాస్ ఫిల్మ్స్ చేస్తున్నారని, మాస్ కమర్షియల్ చిత్రాలకు తన ముఖం సరిపోదని, 2016 లో తానూ రెండు తెలుగు ఫిల్మ్స్ చేస్తానని సిద్దార్థ్ అన్నారు.

టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ చేసేటప్పుడు కథకు ఎన్నుకోవడంలో జాగర్త పడతానని, కన్నడంలో వచ్చిన లూసియా చిత్రం చూశానని, అది తమిళంలో రీమేక్ చేయడానికి నిర్మాత హక్కులు కొన్నప్పుడు అందులో నటించాలనే ఆరాటంతో నిర్మాతను కలిసానని సిద్దార్థ్ అన్నారు. తాను కన్నా పెద్ద కల ఫలించి ఈ చిత్రంలో నటించే అవకాశం పొందానని కూడా ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.