టూ స్టేట్స్ లో శివానీ ...

shivani jrajsekharబాలీవుడ్ లో విజయవంతంగా సాగిన 2 స్టేట్స్ చిత్రం తెలుగులో పునర్నిర్మించడంతోనే అడివి శేషు హీరోగా నటించబోతున్నారని టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరైతే సరిపోతారని అనుకుంటుండగా అందరి దృష్టి ఓ తారపై కేంద్రీకృతమైంది. అనేక మాటలు ఆలోచనలు జరిగిన తర్వాత చిత్ర నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చి శివానీని సంప్రతించారు. ఆమె మరెవరో కాదు. ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని. ఇది ఓ రొమాంటిక్ సినిమా.

చిత్ర దర్శకుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ హిందీలో నటించిన అలియా భట్ పాత్రకు తెలుగులో అన్ని విధాల సరిపోయే నటి శివాని అని అన్నారు. అందుకే ఆమెను తాము సంప్రతించామన్నారు. తనను కలిసి కథ చెప్పడంతోనే శివానీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నటించడానికి ఒప్పుకుంది. శివానీ స్టయిల్ దర్శకుడు వెంకట్ రెడ్డికి ఎంతో నచ్చిందని ఈ సినిమా యూనిట్ మాట. ఆమె ఈ పాత్రకు అన్ని విధాల సరిపోతుందనే నమ్మకంతోనే చిత్ర సమర్పకులు శివానీతో ఒప్పందం చేసుకున్నారన్నది వారి మాట. అయితే ఆమె ఒప్పంద పత్రాలపై ఇంకా సంతకం చేయలేదు. ఇప్పటి వరకూ అన్నీ సక్రమంగానే జరిగాయని, మున్ముందు కూడా ఇలాగే సవ్యంగా జరిగేత శివానీ ఈ సినిమాలో కథానాయికగా నటించడానికి ఒప్పందపత్రాలపై సంతకాలు చేయడం ఖాయమని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

ఓ తెలుగు కుర్రాడు ఉత్తర భారత అమ్మాయితో ఎలా ప్రేమలో పడ్డాడన్నదే ఈ చిత్ర కథనం.

Send a Comment

Your email address will not be published.