టెంపర్ ....చూడదగ్గ చిత్రమే...

నందమూరి వంశం నుంచి వచ్చిన తాజా చిత్రం టెంపర్.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం టెంపర్.

గతంలో వచ్చిన చిత్రాలేమో కానీ ఈ చిత్రం తప్పకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు కొడుతుందని అందరి అంచనా.

దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిర్మాత బండ్ల గణేష్ విషయం వేరేగా చెప్పక్కర లేదు.

ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ సమకూర్చారు.

ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించారు.

వైజాగ్ కి బదిలీపై వచ్చిన ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. చిత్ర కథ ప్రకారం అతనికి తల్లితండ్రులు లేరు. అతనొక అనాధ. .పోలీస్ స్టేషనులో జరిగిన ఓ సంఘటన కారణంగా అతను చిన్నన్నాడే ఏం చేస్తే తనం పంతం నెగ్గించుకునే రీతిలో అనుడుకు తగిన పోస్టులో ఉంటూ డబ్బుకి ఏ మాత్రం లోటు లేకుండా ఉంటుందో ఆలోచించి అలాంటి ఉద్యోగమే పోలీస్ అని తలచి అతను పోలీసు వృత్తిలోకి వస్తాడు. వైజాగ్ కు బదిలీ పై వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్థానికంగా డాన్ గా ముద్ర వేయించుకున్న ప్రకాష్ రాజ్ తో చేతులు కలుపు తాడు. డాన్ ఆకృత్యాలకు జూనియర్ ఎన్టీఆర్ సహకరిస్తుంటాడు.

ఇలా ఫస్ట్ ఆఫ్ లో అవినీతిపరుడిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు జంతువులపై విపరీతమైన ప్రేమ చూపించే పాత్రలో నటించిన కాజల్ తో ప్రేమలో పడతాడు. జూనియర్ ఎన్టీఆర్ ఓ ఉన్నతమైన శక్తిమంతుడైన పోలీసు అధికారి అనుకుని కాజల్ అతనిని ప్రేమించడం మొదలుపెడుతుంది. పడుతుంది. వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్న దశలో జూనియర్ ఎన్టీఆర్ జీవిత చక్రంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఓ ప్రమాదంలో చిక్కుకున్న మధురిమని కాజల్ రక్షిస్తుంది. అంతేకాదు తానుప్రేమిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సరైన వాడు కాదని తెలుసుకుని దూరమవడానికి కాజల్ నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఆమెకు ఒక నిజం తెలియవస్తుంది. ఆ సమయంలో ఆమె కోరిన కోరిక జూనియర్ ఎన్టీఆర్ లో ఓ మంచి మనిషి పుట్టుకొస్తాడు. అప్పటి దాకా డాన్ చేతలకు అండగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ డాన్ పై తిరగబడతాడు. ఈ నేపధ్యంలో తలెత్తిన సమస్యలు, మలుపులు చూడాలనుకుంటే టెంపర్ చూడక తప్పదు.

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రకు అన్నివిధాల తగిన న్యాయం చేసాడు అనే చెప్పుకోవచ్చు. అతనిలోని గొప్ప నటనను టెంపర్ సినిమా ప్రేక్షకుల ముందు నిలిపిందని వేరేగా చెప్పా వలసిన పని లేదు. మరోవైపు కాజల్ ఈ చిత్రంలో ఎంతో అందంగా కనిపించింది. మిగిలిన నటీనటుల నటన కూడా అన్ని విధాలా ఓకే.

వక్కంతం కథకు దర్శకుడు పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే , మాటలు చక్కగా సిన్కయ్యాయి.

అనూప్ స్వర పరచిన పాటలు వినడానికి ఎంతో బాగున్నాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం గొప్పగా ఉంది.

Send a Comment

Your email address will not be published.