డిసెంబర్ లో "గంగ"

రాఘవ లారెన్స్ తన దర్శకత్వంలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ముని’ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ‘కాంచన’ కూడా మంచి విజయాన్నే సాధించిన క్రమంలో ఇప్పుడు ముని సీక్వెల్ గా మరో చిత్రం రూపొందిస్తున్నారు. ఆ చిత్రం పేరు “గంగ” ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. దీనిని వచ్చే డిసెంబర్ 25న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ‘’గంగ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మరో ఇరవై రోజుల చిత్రీకరణతో ఆ పార్ట్ కూడా పూర్తవుతుందని” అన్నారు. ఆ తర్వాత అన్ని పనులను పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేయాలని ఉందని అన్నారు. తన ఆరోగ్యం సరిగా లేక వెన్నునొప్పి కారణంగా ఐదు నెలలు షూటింగ్ జరగలేదని, ఈ మధ్యలో తనకు ఓ ఆలోచన వచ్చినట్టు, అదేమిటంటే ఒక టికెట్ తో రెండు సినిమాలు చేయాలనే ఐడియా వచ్చినట్టు చెప్పారు. ఇంటర్వెల్ వరకు ఒక సినిమా ఉంటుందని, ఆ తర్వాత మరో సినిమా ఉంటుందని ఆయన చెప్పారు.

ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్, వినోద, సందేశాత్మక చిత్రంలో లక్ష్మీరాయ్ కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారని చెప్తూ అటు తెలుగు, ఇటు తమిళంలోనూ రూపొందుతున్న ఈ సినిమాను రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. ఈ సినిమా తర్వాత కాంచన సినిమాని అజయ్ దేవగణ్ తో హిందీలో పునర్నిర్మిస్తానని కూడా చెప్పారు.

Send a Comment

Your email address will not be published.