డైరెక్టర్స్ బాయ్

బొమ్మరిల్లు ఫేమస్ సిద్దార్థ ఏదో ఒకే ఒక్క ఇమేజ్ తో ఉండిపోవాలనుకోవడం లేదు. తన చాక్లెట్ బాయ్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. తాను దిరెచ్తొర్స్ బాయ్ నని చెప్పారు. మంచి స్క్రిప్ట్ లో తాను ఒక భాగం కావాలనుకుంటానని సిద్దార్థ అన్నారు. తనకు ఇప్పటిదాకా డైరెక్టర్స్ ఇచ్చిన అవకాశాలన్నింటికి వారికి కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు. తన మీద డైరెక్టర్స్ కు ఉన్న నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదని, ఆ మధ్య ఉదయం ఎన్ హెచ్ 4 సినిమాలోను తాను భిన్నమైన పాత్ర పోషించానని గుర్తు చేసారు.

ఈరోజుల్లో సోషల్ నెట్ వర్క్ సైట్స్ ద్వారా క్షణాల్లో ఎక్కడ ఏం జరిగిపోతున్నదీ అందరికీ తెలిసిపోతున్నదని అన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్న వారికి సోషల్ నెట్వర్కింగ్ ఎంతో మంచిదని ఆయన చెప్పారు. ఈలాంటి సోషల్ నెట్ వర్క్ సైట్స్ అతి సులువుగా తమను అభిమానుల వద్దకు తీసుకుపోతోందని అన్నారు. అది మంచిదే అని అభిప్రాయబడ్డారు. వెబ్స్ లో అభిమానులు వ్యక్తం చేసే అభిప్రాయాలు చదువుతుంటే తాను హ్యాపీగా ఫీలవుతున్నానని సిద్దార్థ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.