తండ్రయ్యారు

కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే తండ్రి కాబోతున్నారని వార్తలు షికార్లు చేస్తూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆయన జూలై 22వ తేదీన తండ్రయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులకు హైదరాబాదులోని రైన్ బో ఆసుపత్రిలో జూలై 22వ తీదీన ఉదయం పదకొండు గంటలకు పండంటి కొడుకు పుట్టాడు. తల్లీ, కొడుకు ఇద్దరూ క్షేమమేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు ఇదే తొలి సంతానం.

త్వరలోనే తాను నటించిన రభస సినిమా విడుదలకానున్న తరుణంలో తమకు కొడుకు పుట్టడం ఎంతో ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. నందమూరి వంశంలో మరొక నటుడు పుట్టాడనుకోవాలా?

తమ అభిమాన హీరో తండ్రి కావడం ఎంతో ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు.

ఇలా ఉండగా పూరీ జగన్నాథ్ ప్రాజెక్ట్ లో నటించాల్సిన కొత్త సినిమా “టెంపర్” కార్యక్రమాలను జూనియర్ ఎన్టీఆర్ ఆగస్ట్ నెలాఖరుకి వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.

జూనియర్ ఎన్టీఆర్ కు 2011 మే 5వ తేదీన ఎన్ తీ వీ స్టూడియో అధిపతి నార్నే శ్రీనివాస రావు కుమార్తె ప్రణతి తో హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో పెళ్లి అయిన సంగతి తెలిసిందే కదా…

Send a Comment

Your email address will not be published.