గోపీచంద్ రాబోతున్న కొత్త చిత్రం లౌక్యం. ఈ చిత్రానికి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గోపీచంద్ జోడీగా రాకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
అలాగే హంస నందిని ఓ ప్రత్యేక పాటలో నర్తించింది.
దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గోపీచంద్ పాత్రను కొత్త తరహాలో చూడవచ్చని ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లో ఓ మంచి చిత్రం అవుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు.
ఈచిత్రంలోని పాటలను విదేశాలలో చిత్రీకరించడానికి వచ్చేనెల అయిదున చిత్ర యూనిట్ బయలుదేరి వెళ్తుందని ఆయన తెలిపారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్.
వచ్చే సెప్టంబర్ నెలలో లౌక్యం చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టు నిర్మాత ఆనందప్రసాద్ తెలిపారు.