హీరో అక్కినేని నాగార్జున అంటే చాలా మందికి ఇష్టం. అభిమానిస్తారుకూడా. ఆ సంఖ్య లక్షల్లో ఉండొచ్చు. కోట్లలో ఉండొచ్చు. అయితే నాగార్జునను మీకు ఎవరంటే ఇష్టమని అడిగినప్పుడు ఆయనేం చెప్పారో చూద్దాం.
ఇటీవల హైదరాబాదులో ఒక రియాలిటీ టీ వీ షో లో నాగార్జున సుహాసిని, దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావులతో కలిసి పాల్గొన్నారు.
అప్పుడు సుహాసిని మాట్లాడుతూ సమంతా, కాజల్, శ్రుతిహాసన్, తమన్నాలో మీరు ఎవరిని ఎన్నుకుంటారని నాగార్జునను అడిగారు.
ఈ ప్రశ్నకు నాగార్జున జవాబిస్తూ “మీరు చెప్పిన వారందరూ హాటే. కానీ తమన్నా వీరందరిలోకి హాటెస్టూ..” అని అన్నారు.
మీరు యువకుడిగా ఉన్నప్పుడు మీరు ఎవరిని ఎక్కువగా అభిమానించే వారు అని అడగ్గా జయసుధ, జయప్రదలను అని చెప్పారు నాగార్జున.
ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు పిక్చర్ ని 20 సార్లు చూసినట్టు నాగార్జున తెలిపారు. ఈ సినిమాలో జయసుధ, జయప్రదలిద్దరూ నటించారు. వీరిద్దరిని మొదటిసారిగా సినిమాలో చూసినప్పటినుంచి తాను వారిని అభిమానించాను అని నాగార్జున చెప్పారు.