రాజ్ మౌళి దర్శకత్వంలో శరవేగంతో సాగుతున్న బాహుబలి సినిమా చిత్రీకరణలో స్టార్ నటి తమన్నా స్టంట్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని యూనిట్ అభిప్రాయం. ఇప్పటికే ఈ చిత్ర షూటింగులో తన స్టంట్ ను అనుష్కా శెట్టి చూపించగా ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. ఆమె ఈ చిత్రంలో ఒక సాహస రాణిగా నటిస్తోంది. కథాపాత్రకు న్యాయం చేసే విధంగా ఆమె పోరాడావలసి ఉంటుంది. ఆమె తన కెరీర్ లో ఇలాంటి పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. అయితే ఆమె స్టంట్ వివరాలు వెల్లడించనప్పటికీ తమన్నా సన్నిహిత వర్గాల వల్ల తెలిసిన విషయం మాత్రం ఇదే ….
” ఓ యుద్ధ వీరుడు ఎలాగైతే దుస్తులు ధరిస్తాడో అదే విధంగా తమన్నా వస్త్ర ధారణ ఉంటుంది. ఆమె వీరోచితంగా పోరాడి శత్రువులను దెబ్బ తీస్తుంది. ఇప్పటికే ఆమె ఈ పాత్రకు అవసరమైన అన్ని జాగర్తలూ తీసుకుంది….”
అంతకుముందే అనుష్కా శెట్టి ఇలాంటి స్టంట్ రిహార్సల్ చేసిందట.
తమన్నా, అనుష్కా ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో కలిసి నటించబోతున్నారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.