తమిళంలో "మనం"

మూడు తరాల అక్కినేని స్టార్లు నటించిన “మనం” సినిమా త్వరలో తమిళంలో విడుదల కానున్నది. ఈ తమిళ చిత్రంలో ముగ్గురు తమిళ స్టార్లు మన అక్కినేని స్టార్లకు గొంతు అరువివ్వనున్నారు. అక్కినేని నాగేశ్వర రావు కి కమల్ హాసన్, అక్కినేని నాగార్జునకు మాధవన్ డబ్బింగ్ చెప్పబోతున్నారు. నాగార్జున మాట్లాడుతూ అదంతా దర్శకుడు విక్రం కుమార్ నిర్ణయమని, తాము ఇప్పటి దాకా ఈ సినిమా డబ్బింగ్ విషయమై వారిని కలవలేదని అన్నారు. కమల్ హాసన్, మాధవన్ లతో దర్శకుడు విక్రం కుమార్ కు సాన్నిహిత్యం ఉందని, వీరు మంచి మిత్రులని చెప్పారు. అంతే కాకుండా గతంలో వారితో విక్రం వర్క్ చేసారు కూడా అని తెలిపారు. చెన్నైలో “మనం” తెలుగు సినిమాను కమల్ కోసం ప్రత్యేకించి ప్రదర్శించారని అన్నారు. కమల్ ఈ చిత్రాన్ని ప్రశంసించడమే కాకుండా దర్శకుడినీ, నాగార్జుననీ అభినందించారు. ఈ క్రమంలో కమల్ హాసన్ అక్కినేని నాగేశ్వర రావు కి డబ్బింగ్ ఇస్తారని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

Send a Comment

Your email address will not be published.