తమిళ్ సూర్యతో...

కోలీవుడ్ స్టార్ సూర్య డబ్బింగ్ కాకుండా స్ట్రెయిట్ గా తెలుగు పిక్చర్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు.
ఈ విషయం తెలిసినప్పటినుంచి టాలీవుడ్ డైరెక్టర్లు సింగం స్టార్ సూర్య కోసం క్యూ కడుతున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ ముందు ఉన్నట్లు, సూర్యతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని టాలీవుడ్ భోగట్టా. అంతేకాదు ఆయన కొన్ని కథలకు సంబంధించి వాటి సారాంశాలను ఇప్పటికే సూర్యకు మెయిల్ చేసారని వార్త. వాటిని చదివిన సూర్య ఒక కథ నచ్చి దానిని డెవలప్ చేయమని పూరీకి చెప్పినట్లు తెలియవచ్చింది.
దీనికి ముందు కూడా పూరీ ఒకటి రెండుసార్లు సూర్యను కలిసి కూడా కథలను చెప్పారని, అయితే అవి అప్పట్లో  సూర్యకు అంతగా నచ్చలేదట. కానీ ఇప్పుడు పూరీ మెయిల్ చేసిన వాటిలో ఒక కథ సూర్యకు నచ్చడం వల్ల వీరి కాంబినేషన్ లో ఏ క్షణంలోనైనా ఒక ప్రకటన వెలువడవచ్చని వార్తలు షికార్ చేస్తున్నాయి. తన బ్యానర్ పైనే పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా న్యూస్.

Send a Comment

Your email address will not be published.