"తిక్క" తిక్కే

ప్రేక్షకులకు తిక్క పుట్టించే “తిక్క” చిత్రం వచ్చింది. సునీల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే తిక్క.
రోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొంసి, మన్నారా చోప్రా, ముమైత్ ఖాన్, రాజేంద్ర ప్రసాద్, అలీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు.

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్, సుప్రీమ్దం సినిమాల విజయంతో మంచి ఊపుమీదున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మాస్ టైటిల్ “తిక్క” తో అభిమానులను అలరించడానికి వచ్చాడు.

ఆదిత్య పాత్రలో నటించిన సాయి ధరమ్ తేజ్ ఓ మామూలు యువకుడు. తాగుడుతోపాటు అమ్మాయిల వెంట పడే అతని జీవితంలోకి అంజలి పాత్రలో నటించిన లారిస్సా బోనేసి వస్తుంది. ఆమెను చూసీ చూడగానే అతను తెగ ఇష్టపడతాడు. ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆమె కూడా అతనిని ప్రేమిస్తుంది. అయితే కొన్ని రోజులకు వారి మధ్య ప్రేమలో స్పర్ధలు వస్తాయి. దానితో అతను మళ్ళీ తాగుడికి బానిస అవుతాడు. ఆ మత్తులో అతను కొన్ని పొరపాట్లు చేస్తాడు. వీటితో అనుకోని మలుపులు తిరుగుతుంది కథ. అదేమిటో తెలుసుకోవాలంటే “తిక్క” చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

నటన విషయానికి వస్తే సాయి ధరం తేజ్ బాగానే ఆకట్టుకున్నాడు తిక్కున్నోడుగా. అంజలి పాత్రలో నటించిన లారిస్సా నటన మెరుగే. అయినా ఆమె పాత్రను మరింత చక్కగా నడిపించాల్సింది.

తమన్ సంగీతం చిత్తమొచ్చినట్టుగా ఉంది.

ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది.

ఒకటి రెండు చోట్ల తప్పించి దర్శకత్వం బాగులేదు. కామెడీ కూడా బాగులేదు.

Send a Comment

Your email address will not be published.