తీరు మార్చుకున్న త్రిష

నటి త్రిష తన పద్ధతి మార్చుకుంది. మునుపటిలా బీరాలకు పోవడం లేదు. తన అసలు స్థితి తెలుసుకుంది. అందుకే కెరీర్ పరంగా నిలదొక్కుకోవడానికి త్రిష తన తీరు మార్చుకున్నట్టు సినీ వర్గాల మాట. కొంతకాలం క్రితం త్రిష తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకోవడంతో ఆమెకు వృత్తిపరంగా కొంత గ్యాప్ వచ్చినట్లు చెప్పే వారున్నారు.

అయితే ఆమె ఇప్పుడు తాను పూర్వపు స్థితి సంపాదించడానికి పట్టుదలతో కృషి చేస్తున్నాది. అందుకనే ఆమె బిజీ కావడం కోసం కేవలం తమిళం, తెలుగు చిత్రాలకే పరిమితమైపోకుండా కన్నడ సినీ రంగంలోనూ వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకుపోవాలని  ఆరాట పడుతున్నాది. ఆ క్రమంలో  కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితంకాకుండా స్పెషల్ సాంగులో నర్తించడానికి  కూడా త్రిష ఆసక్తి కనబరుస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడంలో ఆమె నటించిన పవర్ సినిమా సక్సస్ సాధించడం వల్ల ఇప్పుడు కన్నడంలోనూ ఆమెకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె బాలకృష్ణ సరసన ఒక సినిమాలో నటిస్తున్నాది. తమిళంలో ధనుష్ తో ఒక కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్రిష. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన లింగా అనే సినిమాలో త్రిష ఒక ఐటెం సాంగులో నర్తించింది. దీనితి ఇప్పుడు ఆమెకు మరో సినిమాలోను ఒక అవకాశం వచ్చినట్టు  తెలిసింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించి సూపర్ హిట్టు కొట్టిన ఆత్తారింటికి  దారేదీ చిత్రాన్ని కన్నడంలో సుదీప్ రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఒక ఐటెం సాంగులో త్రిష నర్తించ బోతున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.