తెలుగు రాక తపన

lleanaఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా ఉండిన ఇలియానా కొన్నిరోజుల తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడామె టాలీవుడ్ కి వస్తానన్నా అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. అందుకు ప్రధాన కారణం ఆమె తెలుగు మాట్లాడలేకపోవడమే.

శ్రుతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సమంతా, నిత్యా మీనన్, రాశి ఖన్నా, కాథరీన్, రెజీనా కాసాండ్రా, హీబా పటేల్, ప్రణీత, మరికొందరు టాలీవుడ్ లో రంగప్రవేశం చేశారు. వాళ్ళందరూ తెలుగువారుకాదు. వేరే భాషల వారు. అయితే వాళ్ళందరూ తెలుగుభాష నేర్చుకున్నారు. కానీ ఇలియానా ఎందుకో తెలుగునేర్చుకోలేక పోయారు. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి మొదటిసారిగా నటిస్తున్న పరిణితి చోప్రా కూడా తెలుగు నేర్చుకుంటోంది. కానీ తెలుగు రాకపోవడంతో ఇలియానాకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.

ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో పోటీ విపరీతంగా ఉందని, ప్రతి నటి తెలుగు నేర్చుకుని అర్ధం చేసుకుని నటించడం వల్ల షూటింగ్ కూడా తక్కువ టైంలోపూర్తి చేసే అవకాశం కలుగుతోందని, తెలుగురానప్పుడు టేకులు ఎక్కువై ఖర్చు కూడా పెరుగుతోందని అన్నారు. అంతేకాకుండా సినిమాను ప్రమోట్ చేసేటప్పుడు నిర్వహించే కార్యక్రమంలో కథానాయిక తెలుగులో మాట్లాడటం చిత్రానికి ఒక అడ్వాంటేజ్ అవుతుందని అన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో చిత్రంలో తానే మాట్లాడింది. అలాగే ఊపిరి చిత్రంలో తమన్నా కూడా తానే మాట్లాడింది. అంతదాకా ఎందుకు, ఆ, ఆ చిత్రంలో నటించిన మలయాళ నటి అనుపమా పరమేశ్వరన్ కూడా తానే తెలుగు మాట్లాడింది.అంతకుముందు తాప్సి, నయనతార కూడా తామెడబ్బింగ్ చెప్పుకున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతోపాటు తమిళం కూడా నేర్చుకుంది. సెట్స్ లోను వేరే ప్రాంతాల నుంచి వచ్చిన తారలు తెలుగు నేర్చుకుని మాట్లాడటం విశేషం కానీ ఇలియానా ఆ పనిచేయలేకపోయింది.

తెలుగు తెలుసుకుని మాట్లాడే తారలకు అవకాశాలు ఇవ్వడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని బోయపాటి అన్నారు. ఇలియానా కూడా తెలుగు నేర్చుకుంటే తప్పకుండా టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవు అని ఆయన పరోక్షంగా అన్నారు.

Send a Comment

Your email address will not be published.