తెలుగు వర్షమే....బాఘి..

తెలుగులో సూపర్ హిట్టు కొట్టిన వర్షం చిత్రం ఇప్పుడు హిందీలో పునర్ నిర్మిస్తున్నారు. ఎహిందీ చిత్రంలో టైగర్ ష్రాఫ్, సుదీర్ బాబు, శ్రద్ధా కపూర్ తదితరులు నటిస్తున్న బాఘి చిత్రం తెలుగు వర్షంలో ప్రభాస్, త్రిషా జోడీగా నటించిన సంగతి తెలిసిందే కదా…ఇక గోపీచంద్ ఈ చిత్రంలో విలన్ గా నటించారు. గోపీచంద్ పాత్రను హిందీలో సుదీర్ బాబు పోషిస్తున్నారు.

వర్షం సినిమాతోనే ప్రభాస్ దశ తిరిగింది అని అందరికీ విదితమే. అలాగే గోపీచంద్ కి కూడా మంచి బ్రేక్ లభించింది.

హిందీ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ హిందీలో కూడా యువ నటీనటులతోనే చిత్రాన్ని నిర్మించాలనుకుని ఆ విధంగానే నటులను ఎన్నుకున్నామని తెలిపారు.

హిందీలో బాఘి చిత్రానికి సబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.