తెలుగు, హిందీల్లో ఐతే 2.0

రెండు దశాబ్దాల క్రితం తెలుగులో విడుదల అయి అవార్డు గెల్చుకున్న “ఐతే” చిత్రానికి కొనసాగింపుగా కాకుండా విడిగా “ఐతే 2.0″ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రాబోతోంది.

హైదరాబాద్ లో నవంబర్ 18వ తేదీన ఈ చిత్రం శ్రీకారం చుట్టుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ ముదిరాజ్.

రాజ్ మాట్లాడుతూ ఇది అప్పట్లో వచ్చిన ఐతే చిత్రానికి సీక్వెల్ కాదని, ఐతే 2.0 ఓ టెక్నో థ్రిల్లర్ అని అని చెప్పారు. యువతపై సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం ఏమేరకు ఉందో చూపించడానికి ఐతే 2.0 చిత్రం తీస్తున్నట్టు చెప్పారు. ఐతే చిత్రానికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా భిన్నమైనదని ఆయన అన్నారు. హిందీలో ఈ చిత్రం పేరు ” పైరేట్స్ 1.0 ” అని చెప్పారు.

షూటింగ్ మొదలయినట్టు చెప్తూ 40 – 45 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఉందని అన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల నుంచి నటీనటులను ఎంపిక చేసినట్టు, అంతా కలిసి నటిస్తారని రాజ్ తెలిపారు. ఇంద్రనీల్ సేన్ గుప్తా, జరా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారని చెప్తూ ఈ చిత్రానికి కె విజయరామరాజు నిర్మాత అని కూడా దర్శకుడు రాజ్ ముదిరాజ్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.