తేజకు కథ వినిపించిన కమల్

మామూలుగా అయితే డైరెక్టర్ కథను హీరోకి వివరిస్తారు. అయితే ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది…. ఆ ఇద్దరు ఎవరంటే దర్శకుడు తేజ, హీరో కమల్ హాసన్. అందుకు కారణం లేకపోలేదు…
వీరిద్దరి మధ్య కథాపర్వం గత డిసెంబర్ లో మొదలైంది. కమల్ తాను అనుకున్న కథను తేజకు వివరించారు.
తేజ మాట్లాడుతూ కమల్ హాసన్ గారు ఇప్పటికే ఎన్నో కథలు పుట్టించారు. ఎన్నో కొత్త కొత్త పాత్రలు వేసారు….అవన్నీ అద్భుతమైనవే. కనుక ఆయనకు నేను ఒక కథ రాయడమో పాత్ర పుట్టించడమో జరగని పని. అందుకే ఆయననే ఆ రెండు పనులు చెయ్యమని కోరాను. ..” అని అన్నారు.
తేజ కోరిక మేరకు కమల్ తన మదిలో మెదలిన కొన్ని కథలను తేజతో పంచుకున్నారు. ఆ తర్వాత జరిగిన చర్చలలో ఒక కథను ఖరారు చేసారు. ఆ కథకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే సిద్ధం చేస్తున్నారు. నాయకుడు, ఖైదీ వేట వంటి యాక్షన్ సినిమా తయారు చెయ్యాలన్నదే తేజ ఆశ. ఈ చిత్రానికి తేజ మాటలు రాస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.