తేజా దర్శకత్వంలో కాథరీన్

సరైనోడు చిత్రంలో నటించిన కాథరీన్ ట్రెసా తదుపరి చిత్రంలో దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్ లతో కలిసి నటించబోతోంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడెక్షన్ దశలో ఉంది.

రానా తాను చేయబోయే చిత్రాలకు సంబంధించి స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగర్తలు తీసుకుంటున్నారు. బాహుబలి చిత్రం తర్వాత నుంచి ఆయన వేసే ప్రతి అడుగులోను ఆచి తూచి అడుగేస్తున్నారు.

బాహుబలి సీక్వెల్ పూర్తి అయినా తర్వాత రానా నటించబోయే చిత్రం తాలూకు షూటింగ్ మొదలవుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రంలో కాజల్ నటించడం ఇప్పటికే ఖాయం అయింది కనుక తేజ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న రెండో చిత్రం అవుతుంది ఇది. అంతకుముందు 2006 లో ఆమె మొదటిసారిగా తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం చిత్రంలో నటించింది. టాలీవుడ్ లో ఆమె నటించిన మొదటి చిత్రం అదే కావడం గమనార్హం.
ఇప్పుడు తేజ చిత్రంలో నటించడానికిరానా, కాజల్ ముందే ఒప్పందం చేసుకున్నారు. కాథరీన్ ట్రెసా ఇప్పుడే సంతకం చేశారు.

సరైనోడు చిత్రంలో కాథరీన్ నటన తేజను ఆకట్టుకుంది.

తేజా చాలా కాలానికి చేస్తున్న ఈ చిత్రంతో తనకో మంచి బ్రేక్ కోసం ఆశిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.