“జనతా గ్యారేజ్” చిత్ర విజయాన్ని ఆస్వాదించిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలూ తీసుకోలేదు.
ఈమధ్యే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి థాయిలాండ్ వెళ్లి కొన్ని రోజులు అక్కడ గడిపి హైదరాబాద్ చేరుకున్నారు.
ఎన్టీఆర్ సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం విషయానికి సంబంధించి స్క్రిప్ట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఆయన దృష్టి అంతా ఇప్పుడు మంచి కథ పై ఉందన్నారు. అందుకే ఏ మాత్రం తొందరపడకుండా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఎక్కువసేపు ఇంటిపట్టునే ఉంటూ పిల్లాడు అభయ్ రామ్ కి అ, ఆలు నేర్పడంలో నిమగ్నమయ్యారు.
మరోవైపు ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కానీ ఈ విషయంలో ఇప్పటికింకా ఓ నిర్ణయానికి రాని ఎన్టీఆర్ ను మరికొందరు మేటి దర్శకులు కూడా కలిసి మాట్లాడినట్టు తెలియవచ్చింది. ప్రతి దర్శకుడు భిన్నమైన కథలతోనే ఆయనను సంప్రదిస్తున్నారు. అయితే మరి కొన్ని రోజుల్లోనే ఆయన ఓ కథను ఎన్నుకుని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.