త్వరలో ఆహా కల్యాణం

మొదటినుంచి అవకాశాలను అందిపుచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో నటిస్తున్న నాని, వాణీ కపూర్ జంటగా నటిస్తున్న ఆహా కల్యాణం ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం హిందీలో విజయవంతమైన బాండ్ బాజా బరత్ సినిమాకు రీమేక్. అటు తెలుగులోనూ ఇటు తమిళంలోనూ ఒకే సారి నిర్మితమైన ఆహా కల్యాణం చిత్రంలో మరో ప్రధాన పాత్రలో సిమ్రాన్ కనిపించబోతున్నారు.

ఎ. గోకుల్ కృష్ణ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి ధరన్ కుమార్ సంగీతం సమకూర్చారు. తామనుకున్న దానికన్నా ఇందులోని సన్నివేశాలు బాగా వచ్చాయని, కనుక తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకాని దర్శకుడు వ్యక్తం చేసారు.

ఈ చిత్రానికి మనీష్ శర్మ కథ అందించగా మాటలు వెన్నెలకంటి శశాంక్ రాసారు.

Send a Comment

Your email address will not be published.