త్వరలో పెళ్లి

సమంత – నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు వెలువడుతున్న క్రమంలో ఇప్పుడు నాయనతార కూడా త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు సమాచారం.

అటు టాలీవుడ్ లోను, ఇటు కోలీవుడ్ లోను ఓ వెలుగు వెలుగుతున్న నయనతార కు దర్శకుడి విఘ్నేష్ శివన్ తో పెళ్లి జరగబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆమె ఇప్పటికే విఘ్నేష్ శివన్ తో ఉంటున్నట్టు వదంతులు వ్యాపించాయి.

విఘ్నేష్ శివన్ తరచు నయనతార గురించి మాట్లాడుతూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని చెప్పడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

అయితే ఒక్క విషయం. నయనతార కానీ విఘ్నేశ్ శివన్ కానీ ఈ విషయమై బహిరంగంగా ఒక్క మాట కూడా ఇప్పటివరకు చెప్పలేదు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కెమెరా కళ్ళకు ఎన్నో పోజులు ఇచ్చారు. నాన్ రౌడీ దాన్ అనే ఓ తమిళ చిత్రానికి గాను ఇద్దరికి అవార్డులు లభించాయి. ఈ కార్యక్రమంలో ఇద్దరూ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. కలిసిమెలసి నవ్వులు పంచుకున్నారు.

తెలుగులో నయనతార నటించిన బాబు బంగారం విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో నయనతార వెంకటేష్ సరసన నటించింది

Send a Comment

Your email address will not be published.