త్వరలో శంకరాభరణం

ఈగొస్ కి అతీతంగా కృషి చేశాం – నిఖిల్

———————————————–
శంకరాభరణం సినిమా డిసెంబర్ నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం ప్రమోట్ చేయడంలో భాగంగా చిత్ర హీరో నిఖిల్ కొన్ని విషయాలు చెప్పారు.

సూర్యా వెర్సస్ సూర్యా చిత్రం తర్వాత ఎలాంటి చిత్రం చేయాలని మనసులో అనుకున్నానో అలాంటి సినిమానే ఇప్పుడు తాను చేశానని, తాను అనుకున్న విధంగానే శంకరాభరణం సినిమా రూపొందినట్టు నిఖిల్ చెప్పారు.

తాను అంతకు ముందు చేసిన మూడు చిత్రాలకు భిన్నంగా ఓ సినిమా చేయాలనుకున్నానని, అందుకు తగినట్టే శంకరాభరణం చిత్రం తయారైనట్టు నిఖిల్ అన్నారు.

మహేష్ బాబు, రామ్ చరణ్, బాలకృష్ణ తదితరులతో కలిసి పని చేసిన ప్రముఖ రచయిత కోన వెంకట్ తనకు కాల్ వచ్చినప్పుడు తాను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానని, ఆయన ఈ సినిమాకు తనను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిఖిల్ తెలిపారు.

శంకరాభరణం లో క్యారక్టర్ కన్నా ప్రధానమైనది స్క్రిప్ట్ కనుక స్క్రిప్ట్ మొత్తం తనకు చెప్పాలని కోరానని, ఎందుకంటే కొన్ని కథలు నటులను దృష్టిలో పెట్టుకుని రాస్తారని, అయితే ఈ కథ భిన్నమైనదని నిఖిల్ అన్నారు. వాళ్ళు కథను ముందుగా పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాత తగిన నటులకోసం గాలిస్తున్నారని, అప్పుడు ఈ కథలోని పాత్రకు తాను సరిపోతానని కోన వెంకట్ గారు అనుకుని తనను పిలవడం సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి చెప్పుకోవలసిన మరో గొప్ప విషయం చిత్రానికి పని చేసిన వారందరం ఈగొస్ పక్కనపెట్టి వర్క్ లో ముందుకు సాగామని నిఖిల్ చెప్పారు.చిన్నపాటి టెక్నీషియన్ మొదలుకుని కోన వెంకట్ వరకు అందరం ఒక టీం గా పని చేశామని అన్నారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాలలో షూటింగ్ సాగిందని, చిత్రం ప్రాతంభం నుంచి చివరి షాట్ వరకు తాను మొత్తం టైం ని ఈ చిత్రానికి అంకితభావంతో కేటాయించినట్టు నిఖిల్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.