త్వరలో సెట్స్ పైకి అల్లు అర్జున్ సినిమా

అల్లు అర్జున్ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుంది.

అత్తారింటికి దారేది సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 22 నుంచి హైదరాబాదులో జరుగుతుంది.

స్క్రిప్ట్‌లో కొన్ని మార్పుల వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ చిత్రంలో బన్నీ(అల్లు అర్జున్) ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. వారిలో ఒకరు సమంతా. మరో ఇద్దరు కథానాయికలు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది.

రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

“రేసుగుర్రం” వంటి భారీ హిట్ కొట్టిన సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ కొత్త చిత్రం నిర్మాణం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.