దిక్కులు చూడకు రామయ్యా

వారాహి చలన చిత్రం సంస్థ తాజాగా ప్రేక్షకుల ముందు ఉంచి దిక్కులు చూస్తున్న చిత్రమే దిక్కులు చూడకు రామయ్యా….గతంలో ఈ సంస్థ లెజెండ్, ఊహలు, గుసగుస లాడే వంటి చిత్రాలు అందించిన సంగతి తెలిసిందే.

ఈ సారి కొత్త కథనంతో దిక్కులు చూడకు రామయ్యా చిత్రాన్ని సమర్పించింది. నాగ శౌర్య, సన మక్ బూల్,  అజయ్, ఇంద్రజ తదితరులు నటించిన ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించారు.  ఎం ఎం కీరవాణి స్వరాలూ అందించారు. ఈ సినిమాకు నిర్మాత రజని కొర్రపాటి. నాగ శౌర్యకు ఇది రెండో సినిమా.

ఒకే అమ్మాయి ప్రేమలో తండ్రీ కొడుకులు పడితే ఎలా ఉంటుందో  చెప్పే సినిమానే ‘దిక్కులు చూడకు రామయ్య’

అజయ్ పెద్దల మాటకు మేరకు పదిహేనేళ్ళకే ఇంద్రజని పెళ్లి చేసుకొని ఇరవైనాలుగు ఏళ్ళకే  ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతారు.  అయితే  టీనేజ్సరదాలు తీరకుండానే  పెళ్లి అయిపోయినందుకు అజయ్ బాధపడుతుంటారు. తానూ పొందలేక పోయిన ప్రేమ కోసం తహతహలాడుతుంటారు. ప్రేమకోసం అతను ఓ  అమ్మాయిని ప్రేమలో దింపడానికి ప్రయత్నిస్తారు.  తీరా ఆ అమ్మాయినే అజయ్ కొడుకుగా నటించిన నాగ శౌర్య కూడా ప్రేమిస్తాడు. తాను ప్రేమించే అమ్మాయినే తన తండ్రి కూడా ప్రేమిస్తున్నాడని,  పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిసి కొడుకు ఖంగుతింటాడు. ఇలా మలుపులు తిరిగిన చిత్రాన్ని తీయడం సాహసోపేతమే. ఎందుకంటె ఇది ఎంతో సున్నితమైన అంశం. ఇదొక తక్కువ  బడ్జెట్‌తో తీసిన చిత్రం.

అజయ్ నటన బాగుంది. కీరవాణి సంగీతం ఆస్వాదించవచ్చు.

కొత్తదనం కావాలనుకున్న వారికి ఈ కథ బాగానే ఉంటుంది..

Send a Comment

Your email address will not be published.