“నచ్చిన సినిమాల్లో నటించడం వరకే నా వంతు…..అక్కడితో బాధ్యత తీరిపోతుంది. ఆతర్వాత సినిమా ప్రమోషన్ లలో పాల్గొనే టైం నాకు లేదు…సారీ”
ఈ మాటలు సొగసరి హన్సికవే. ఒకప్పుడు నయనతార నోటంట ఇలాంటి మాటలు వినిపిస్తుండేవి. ఇప్పుడు ఆ బాటలోనే హన్సిక కూడా నడుస్తోంది. అందానికి మారుపేరుగా తన సొగసులతో యువతరం మనసులను కట్టిపడేసే హన్సిక చేతిలో ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు ఉన్నాయి. దానితో ఆమె షూటింగులతో యమబిజీ అయ్యింది. అంతే కాదు, కొత్త ప్రాజెక్టులకు చర్చలు జరపడం, సంతకాలు చేయడంతో క్షణం తీరిక లేకుండా ఉంటున్న హన్సిక ఇప్పటికే పూర్తి, విడుదల అయిన సినిమాల ప్రచారంలో మాత్రం పాల్గొననని నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్తున్నాది. తమిళ హీరో ఆర్య సరసన ఒక సినిమాలో నటించిన హన్సిక మొదట డేట్స్ లేవని చెప్పినప్పటికీ చిత్ర దర్శకుడు పట్టుబట్టి మరీ భారీ పారితోషికం ఆఫర్ చేసి నాయికగా ఎంపిక చేసారు. అయితే ఆ సినిమా షూటింగ్ ఈమధ్య పూర్తయింది. ప్రచారానికి రావలసిందిగా నిర్మాత, దర్శకుడు అడిగితే తానూ ఖాలీగాలేనని జవాబిచ్చింది.