నటి జ్యోతిలక్ష్మి ఇక లేరు

Jyothilakshmiఐటెం సాంగ్ డాన్సర్ గా పేరు గడించిన జ్యోతిలక్ష్మి ఇక లేరు. ఆమె వయస్సు 63 ఏళ్ళు.
గత కొంతకాలంగా బ్లడ్ కాన్సర్ తో బాధ పడుతున్న జ్యోతిలక్ష్మి ఆగస్టు 9 వ తేదీన చెన్నై లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తో పాటు అనేక భాషల్లో నటించిన జ్యోతిలక్ష్మి తన కెరీర్ లో మూఢ వందల యాభైకి పైగా చిత్రాల్లోనటించారు.

ఐటెం సాంగ్ డాన్సర్ గానే కాకుండా కొన్ని చిత్రాల్లో కథానాయికగా కూడా నటించిన పలువురి ప్రశంసలు పొందిన ఆమె అందాన్ని చూడటానికి ప్రేక్షకులు సినిమాలు చూసిన రోజులున్నాయి. ఐటెమ్ సాంగులకు ఆమె చేసే నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసేది.

వ్యాంపు పాత్ర‌లకు పెట్టిందిపేరైన జ్యోతిల‌క్ష్మి కోసం ప్రత్యేకించి కొన్ని చిత్రాల్లో ఐటెం సాంగ్ లకు చోటు కల్పించిన సందర్భాలు ఉన్నాయి.

ఆమె అగ్ర నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితరులతో నటించారు.

ఆమె చేసిన ఐటెం సాంగ్ లలో “లేలేలే.. నా రాజా…” అనే పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాటే…ఎవర్గ్రీన్ డాన్సే. ఈ పాటను గానీ ఆమె డాన్సుని గానీ ఎవరూ మరచిపోలేరు.

చెన్నైలోని క‌న్న‌మ్మ పేట‌లోనే ఆమె అంత్య‌క్రియ‌లు జరిగాయి. ఆమె మృతి పట్ల దాసరి నారాయణ రావు, నాజర్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

ఆమె తర్వాత ఆమె చెల్లెలు జయమాలిని కూడా సినీ పరిశ్రమలో ఐటెం పాటలు డాన్స్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం గడించారు.

Send a Comment

Your email address will not be published.