నయనతార ఎక్కడ...?

ఎల్లప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉండే నటి నయనతార. ఆమె మీద వచ్చిన గ్యాసిప్స్ మిగిలిన తారల కన్నా ఎక్కువే. అయినప్పటికీ వాటిని భరిస్తూ సినీ రంగంలో ఉంటున్న తార నయనతార. ఆమెలోని ఆత్మవిశ్వాసం ఒక పాలు ఎక్కువనే చెప్పుకోవచ్చు. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ ఆమె తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యమే. అనామిక చిత్రం అనంతరం ఆమెకు కొత్తగా వచ్చిన తెలుగు చిత్రాలేవీ లేవు.

సహజంగా ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో నటించిన ప్రధాన నటీనటులు ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వసాధారణం. అయితే నయనతార ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చాలా అరుదైన విషయం. ఆమె ఏదైనా ఒక సినిమాకు ఒప్పుకున్నప్పుడు ఆ సినిమా తాలూకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననని ముందే నిర్మాతకు నిర్మొహమాటంగా చెప్తుంటారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన అనామిక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నయనతార ప్రమోషన్ విషయంలో శేఖర్ కు చెడు అనుభాన్నే మిగిల్చారు. అప్పుడు ఎందుకనో వచ్చిన తేడాతో ఆమె తన దృష్టిని తమిళ చిత్రపరిశ్రమపై మరల్చింది. తమిళంలో చెప్పుకోదగ్గ రీతిలోనే ఆమె బిజీగా ఉన్నారు. సూర్యా, జయం రవి తదితరులతో ఆమె చేస్తున్న సినిమాలున్నాయి. కానీ టాలీవుడ్ లో మాత్రం ఆమె జాడ లేకుండా ఉంది. ప్రశ్నలే తప్ప జవాబు దొరకడం లేదు…? తమిళంలో చేస్తున్న సినిమాలే ఆమె చాలనుకున్నారా అని కూడా అనుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.