నయనతార డుమ్మా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార, వైభవ్, హర్షవర్ధన్, రాణే తదితరులు నటిస్తున్న అనామిక పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ఎం ఎం కీరవాణి స్వరాలూ సమకూర్చిన ఈ గీతాల తొలి సి డీ ని ఏ రమేష్ ప్రసాద్ విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కహానీ సినిమాను తెలుగులో తీసేందుకు తానే ముందుకు వచ్చానని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఈ సినిమా చెయ్యమని నిర్మాతలే తనను అడిగారని ఆయన చెప్పుకొచ్చారు. ఇటువంటి కథ తిరిగి దొరకక పోవచ్చన్న ఉద్దేశంతో తాను సరేనని దర్శకత్వం వహించేందుకు ఒప్పుకున్నానని శేఖర్  కమ్ముల అన్నారు.
“కహానీ చిత్రంలో నాయిక గర్భవతి. కానీ తెలుగులో గర్భవతి పాత్ర మీద సానుభూతి పెరగకూడదని మార్పు చేసాం. అయితే అదే సమయంలో భావోద్వేగాలు దెబ్బతినకుండా కథను నడిపించాము” అని శేకర్ కమ్ముల చెప్పారు.
ఇలా ఉండగా, ఈ కార్యక్రమానికి హీరోయిన్ నయనతార హాజరుకాకపోవడం చర్చనీయమైంది. నయనతార గైరుహాజరు పట్ల శేఖర్ కమ్ముల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఈ చిత్రం నయనతారతో చెయ్యాలన్నది తన అభిప్రాయం కాదని, నిర్మాతల నిర్ణయమని ఆయన అన్నారు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే శేఖర్ కమ్ముల ఎవ్వరినీ ఒక్క మాతా అనరు. అయితే నయనతార గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం పలువురిని ఆశ్చర్యపరచింది.
మరోవైపు నయనతార, శేఖర్ కమ్ముల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. చిత్ర ప్రమోషనల్ సాంగ్ షూట్ చెయ్యడానికి శేఖర్ కమ్ముల సమయమడిగారని, కానీ ఆమె ఒక్క తేదీ కూడా చెప్పలేదని తెలిసింది. దానితో శేఖర్ కమ్ముల తాను అనుకున్నట్టుగా  ప్రమోషనల్ సాంగ్ క్షణం క్షణం ను ప్రముఖ నేపధ్య గాయని సునీతపై చిత్రీకరించారు. ఆ వీడియో లో నయనతార కన్నా ఎక్కువ స్పేస్ సునీత ఆక్రమించింది. ఈ విషయం తెలిసి నయనతారకు కోపం వచ్చినట్లు తెలిసింది. కానీ శేఖర్ కమ్ముల నయనతారకు కోపం వచ్చిందన్న వార్తలను ఖండించారు. హాలీవుడ్ లో చాలా సార్లు ఇలా జరుగుతుంది అని అన్నారు. ఉదాహరణకు టైటానిక్ చిత్రంలోని థీమ్ సాంగ్ లో సింగర్ సెలైన్ డియాన్ ఎక్కువసేపు కనిపిస్తుందని చెప్పారు. అలాగే ఈ అనామిక ప్రమోషనల్ సాంగ్ లోను జరిగిందని, అంతకన్నా మరొకటి కాదని ఆయన అన్నారు. నయనతారతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.
చిత్ర నిర్మాతలు కూడా నొచ్చుకున్నారు.
నిశ్చితార్దానికి పెళ్ళికూతురు గైర్హాజారు అయితే ఎలా ఉంటుందో అలా ఉందని నయనతార ఈ పాటల సందడికి రాకపోవడం అనే విమర్శలు వినిపించాయి.

Send a Comment

Your email address will not be published.