14న 'మసాలా'

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో రామ్ లు కలిసి నటిస్తున్న మసాలా చిత్రం నిర్మాణం పూర్తి అయింది. నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైందని చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ చెప్పారు. ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో దర్శకుడు విజయ్ భాస్కర్ ది అందే వేసిన చెయ్యి. మసాలా చిత్రాలు చేయడంలో వెంకటేష్, రామ్ ల స్టైల్ వేరు. హిందీ లో ఘనవిజయం సాధించిన బోల్ బచ్చన్ సినిమాకి రీమేక్. వెంకటేష్, రామ్ ల సరసన అంజలి, షాజన్ పదంసి నటించారు. తమన్ సంగీతం స్వరపరిచారు.

Send a Comment

Your email address will not be published.