నవదీప్ "నటుడు"

అమెరికా వంటి దేశాల్లో అమ్మ ప్రేమను కొనుక్కునే ఒరవడి ఉంది. ఆ ఒరవడి మనకిక్కడ లేదు. అయితే నూటికో కోటికో అన్నట్లు అక్కడక్కడా ఆ విధంగా మానవీయ విలువలతో వ్యాపారం చేసే ఓ వ్యక్తి తారసపడుతూ ఉండొచ్చు. ఆ సంబంధాలతో ఓ వ్యక్తి ఎలా వ్యాపారం చేసాడనే కథాంశంతో నటుడు అనే టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు ఎస్ ఎస్ ఆర్ ప్రసాద్ చెప్పారు. ఈ కథతో సినిమా చేయడం సాహసమని, పది మంది హీరోల చుట్టూ తిరిగితే తాను నటించడానికి సిద్ధమేనని నవదీప్ ఒక్కడే ముందుకొచ్చాడని దర్శకుడు ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రంలో నవదీప్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసాడని అన్నారు. హీరోయిన్ కావ్యా శెట్టి కూడా బాగా నటించారని అన్నారు. ఈ చిత్రంలో రెండు పాటలు చాలా బాగా వచ్చాయని చెప్పారు.
రిస్క్ తో కూడిన కథ అయినప్పటికీ సవాల్ గా తీసుకుని ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని నవదీప్ చెప్పారు. ఈ చిత్రంలో నటన తనకెంతో తృప్తినిచ్చిందని అతనన్నారు.
 లెజెండ్ పిక్చర్స్ పతాకంపై డీ ఎస్ రావు సమర్పణలో కొప్పుల రమేష్ బాబు నిర్మిస్తున్నా ఈ చిత్రంలో నవదీప్, కావ్యా శెట్టి జంటగా నటిస్తున్నారు. స్వరాలు జయసూర్య అందించారు.

Send a Comment

Your email address will not be published.