నాకెంతో ఆనందాన్నిచ్చింది

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఆనందానికి అంతులేదు. అందుకు కారణం శ్రీనివాస్ నటించిన అల్లుడు శ్రీను సినిమాకు మంచి ఆదరణ లభించడమే. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లుడు శ్రీను సినిమా మీద చర్చలు జోరుగానే సాగుతున్నాయి. ఈ చిత్రం ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉండటం, తన సినిమాకు లభించిన ఆదరణ తనకెంతో ఆనందాన్ని ఇచ్చినట్టు శ్రీనివాస్ చెప్పారు.

తన సినిమాకు ఇంతగా ప్రేక్షకులు తరలివస్తారని అనుకోలేదని శ్రీనివాస్ చెప్పారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు వీ వీ వినాయక్ కె దక్కుతుందని ఆయన అన్నారు. నా రోల్ ను ఈ చిత్రంలో అంకుల్ వినాయక్ ఎంతో గొప్పగా నడిపించారని ఆయన తెలిపారు. ఈ సినిమా విజయవంతమవడానికి కథ కూడా ఒక కారణమని అన్నారు. సినిమాలోకి రావాలన్న కోరికతో ఆరేళ్ళు శ్రమించానని చెప్తూ….ఈ ఆరేళ్లలో తాను ఒక్క చోటే కాకుండా వివిధ ప్రదేశాలలో శిక్షణ పొందానని అన్నారు. మొదటగా తాను లాస్ ఏంజిల్స్ వెళ్లానని అక్కడ యాక్టింగు కోర్స్ లో చేరానని చెప్పారు. ఆ తర్వాత నటనలో రాటుదేలడానికి గాను వియత్నాం వెళ్లానని, అనంతరం హైదరాబాదులోను నటనకుసంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ లోకూడా శిక్షణ పొందినట్టు చెప్తూ అరుణ బిక్షు నుంచీ కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులు ముంబైలో ఉన్నానని, అక్కడే నటనపై మరింత ఎక్కువగా దృష్టి సారించి మరెన్నో మెలకువలు తెలుసుకున్నానని చెప్పారు.

ప్రకాష్ రాజ్, సమంతా, బ్రహ్మానందం వంటి సీనియర్ నటులతో తాను కలిసి నటించడం ఓ గొప్ప అనుభవమని అంటూ ప్రకాష్ రాజు తో తాను కలిసి నటించిన షూటింగ్ అంతా పక్కాగా జరిగిందని, ఎక్కడా పిసరంత తేడా కూడా రాలేదని అన్నారు శ్రీనివాస్.

ప్రతి సీనుకు సంబంధించి అంకుల్ వినాయక్ ముందుగానే వివారాలన్నీ ఇచ్చి ఎలా నటించాలో చెప్పుకోచ్చారని శ్రీనివాస్ అన్నారు.

సమంతా సూపర్ స్టార్ అని, తాను ఎక్కడా మొదటి సారి నటిస్తున్నానని అనిపించకుండా సీనియర్ లందరూ తనకు ఎంతగానో తోడ్పడ్డారని, ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేవారని శ్రీనివాస్ అన్నారు. ఈ సినిమాలో సమంతా ఎంతో గొప్పగా నటించిందని, ఐటెం సాంగ్ లో కనిపించిన తమన్నా గురించి మాట్లాడుతూ తానూ సినిమాలో మొదటి సారిగా తమన్నాతో కలిసి ఒక పాటలో డాన్సు చెప్పినట్టు చెప్తూ తాను కొంత టైం తీసుకున్నా ఆమె బాగా సహకరించారని శ్రీనివాస్ చెప్పారు.

సినీ పరిశ్రమలో శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్ అక్కినేని అఖిల్. సినిమా విడుదల అవడంతోనే అఖిల్ తనను పిలిచి పాసిటివ్ గా మాట్లాడారని, అది తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.