నానికో మంచి బ్రేక్

విరంచి వర్మ దర్శకత్వంలో గీత గొల్ల, పీ కిరణ్ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం “మజ్ను”. నాని, అను ఎమ్యూల్, ప్రియ శ్రీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం సమకూర్చారు.

తన తొలి సినిమా “ఉయ్యాల జంపాల”తో మంచి విజయాన్ని అందుకున్న విరించి వర్మ దర్శకత్వంలో ఇప్పుడు మజ్ను చిత్రం కూడా గొప్ప విజయాన్ని అందుకుంటుందని టాలీవుడ్ పరిశ్రమ అంచనా…

నానీకి కూడా గిరాకీ మరింత పెంచే చిత్రంగా చెప్పుకుంటున్నారు.

కథలోకి వెళ్తే….
Majnu-movieఇంజనీరింగ్ చదివి దర్శకుడు రాజమౌళి వద్ద బాహుబలి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే కుర్రాడు ఆదిత్య (చిత్రంలో నాని పాత్ర పేరు) సుమను చూసి చూడటంతోనే ప్రేమలో పడతాడు. సుమగా ప్రియశ్రీ నటించింది. ఆ అమ్మాయితో నిజాయితీగా ఉంటూ మంచివాడు అనిపించుకోవడానికి ఒకప్పటి తన అందమైన ప్రేమకథను ఆమెకు చెప్తాడు. అతని నిజాయితీ ఆమెకు నచ్చుతుంది. ఇంకేముంది, ఆమె కూడా అతనిని ప్రేమించడం మొదలుపెడుతుంది.

మరోవైపు, ఆదిత్య ఇంకా తన తొలి ప్రేయసితోనే ప్రేమలో ఉన్నట్టు తెలుసుకుని ఆలోచనలో పడతాడు. ఇదిలా సాగుతుంటే వీరి మధ్యలోకి ఊహించని విధంగా ఆదిత్య మాజీ ప్రేయసి వస్తుంది. కిరణ్ పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. దానితో ఈ ప్రేమకథ మరో మలుపు తిరుగుతుంది. మరి ఆదిత్య ఇద్దరిలో ఎవరిని ప్రేమించి ఏ ప్రేమను గెల్చుకున్నాడో తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాలి.

ఈ అందమైన ప్రేమకథలో నాని, అనుఇమ్మాన్యుయేల్ జోడి చూడడానికి సుందరంగా ఉంది. నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర లేదు. చక్కటి టైమింగ్ ప్రదర్శించాడు. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అను ఇమ్మాన్యూయేల్ కళ్ళతో పలికించిన ప్రేమ భావాలు, ఉద్వేగాలు అదిరాయి. ప్రియశ్రీ నటన కూడా బాగానే ఉంది. వెన్నెల కిషోర్ ఎప్పట్లానే తన ప్రతిభతో ప్రేక్షకులకు నవ్వులు పంచాడు.

గోపి సుందర్ సంగీతం అమోఘం. సన్నివేశానికి తగ్గట్టు సంగీతం సమకూర్చి ఆహా ఓహో అనిపించుకున్నాడు.
కథ పాతదే అయినా దాన్ని చక్కటి దర్శకత్వం, స్క్రీన్ ప్లే తో పండించిన దర్శకుడు విరించి వర్మకు హాట్స్ ఆఫ్.

Send a Comment

Your email address will not be published.